చదువు

0
119

చదువు చదువు అని ఎల్లప్పుడూ ఈ చర్చలేలా???
చదువుటకా లేక చదువుకొనుటకా ఈ చింత
చదువుకునుటకు చాలు ఆసక్తి, జ్ఞాపకశక్తి
కాని చదువుకొనుటకు కావాలి పలుకుబడి, ధనం
ఎంత చదివిననూ సమయానుసారం
సమయస్ఫూర్తితో ఉపయోగించని యెడల
చదువుకు ఏమున్నది విలువ????

చదువుకునుటకు చాలు సర్కారు బడులు
చదువుకొనుటకు కావాలి ప్రైవేటు స్కూళ్ళు
సర్కారు బడి అయినా, ప్రైవేటు స్కూల్ అయినా
చదువు ఒకటే, చదివించేది ఒకటే
భాషా మాధ్యమంలో ఉండచ్చు ఆంతరం

సర్కారు బడి యందు చదివినవారు కాలేదా గొప్పవారు????
గడించలేదా పేరు ప్రఖ్యాతులు????
ప్రైవేటు స్కూళ్ళ యందు చదువుకొంటున్నవారు
పోగొట్టుకుంటున్నారు ఆర్జించిన ధనం
కలిగిస్తున్నారు పిల్లలకు లేని సౌఖ్యం

సౌఖ్యాలు పెంచుతూ నామాలు మారుస్తూ
కొత్తగా కడుతున్న ఈనాటి ప్రైవేటు స్కూళ్ళు
వసూళ్ళ పేరుతో పెడుతున్నారు నామాలు
చతికిలబడుతున్నాయి ఈ తరం చదువులు

సర్కారు బడి అయినది
సడి లేని గుడి
ప్రైవేటూ స్కూళ్ళు మారేను దాహార్తి తీర్చే నీళ్ళు
సర్కారు బడి అయినా
ప్రైవేటూ స్కూల్ అయినా చదువు చెప్పే విధం ఉండాలి విద్యా విహారం
చదివించు మార్గాలు కలిగించి ఆహ్లాదం, సమకూరుస్తూ తీరిక,
ఆసక్తిని పెంపొందించి చేకూర్చాలి జ్ఞానాన్ని
మాటలకు జడిసి , చదువులో తడబడి
పరీక్షలు తప్పునేమోనని భయపడు పిల్లలను మార్చద్దు
చిట్టీలు పెట్టే మొసగాళ్ళుగా
అంతకు మిన్న కల్పించండి మరొక అవకాశం
లేని పక్షమున ఏమున్నది పాస్ అయినా ఫెయిల్ అయినా అంతరం???
ప్రైవేటు బడులు కారాదు ధనం ఆర్జించే బళ్ళు
ప్రాథమిక వసతులు, సౌకర్యాలు కల్పించి
సర్కారు బడులను మార్చండి చదువుల దేవాలయాలుగా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here