‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1. కమండలువు (4) |
| 3. మానవ గణన యంత్రము అంటారట ఈ దేవి గారిని (4) |
| 7. గ్రహముల యొక్క దినముల లెక్క (2) |
| 8. ఆగ్నేయదిశయందలి యాఁడేనుఁగు (3) |
| 9. కలిసికొనుట (2) |
| 12. వ్యవహారవిషయమైన వ్రాఁత (3) |
| 13. శషసహలలో నొకటి (3) |
| 17. సమూహము (2) |
| 18. కుబేరుని నవనిధులలో ఒకటి – 1,000,000,000,000 – ఒక నూరుఖర్వములు అనుకోండి ! (3) |
| 19. ఎడములేక మిక్కిలి దగ్గిరగానుండు వృక్షముల వరుస (2) |
| 22. తాగేవాడే యిచ్చుకుంటాడుట మరి దీన్ని ( 4) |
| 23. సామాన్యము గానిది; విశిష్టమైనది (4) |
నిలువు:
| 1. విష్ణువు (4) |
| 2. తిథి విశేషము /గంగానది (2) |
| 4. ఏనుగు (2) |
| 5. కావలివాడు (4) |
| 6. నాగార్జున కార్తీల హిట్ మూవీ (3) |
| 10. స్నేహము (3) |
| 11. భయంకరమైనది (3) |
| 14. నిలువు 1 లో ఉన్నాయననే ఒకసారి పిలవండి (4) |
| 15. గంధద్రవ్య విశేషము (3) |
| 16. బాల గంగాధర్ గారి బిరుదు (4) |
| 20. మెరుపు (2) |
| 21. మచ్చరమా? (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఫిబ్రవరి 07వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 48 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఫిబ్రవరి 12 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 46 జవాబులు:
అడ్డం:
1.ఏటికోళ్ళు 3. ఎలకకి 7. దవ 8. హేష్యము 9. ఈల 12. పూదియ 13. పర్వము 17. తమ్మి 18. అర్థము 19. ఏమె 22. ముచ్చిలిక 23. విశ్వగంధ
నిలువు:
1.ఏకాదశి 2. కోణె 4. లగ్గ 5. కిసలము 6. ఋష్యము 10. విదిత 11. ఊర్వశి 14. కుతపము 15. వ్యర్థము 16. ఆమెకథ(ధ) 20. శైలి 21. అశ్వ
సంచిక – పద ప్రతిభ 46 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- రామలింగయ్య టి
- శ్రీనివాసరావు సొంసాళె
- వనమాల రామలింగాచారి
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

