‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1. కలవల కంపరములో గజిబిజి గందరగోళం (6) |
| 4. స్థానిక వృత్తాంతము, చరితము (4) |
| 7. పోతన చివర లోపించిన విష్ణువు (2) |
| 8. సినిమాగా మలచబడిన ఒక యద్దనపూడి నవల (2) |
| 9. త్యాగరాజస్వామి వారి కీర్తనలలో బహుళ ప్రజాదరణ పొందిన కీర్తన (7) |
| 11. పుష్పమాలిక (3) |
| 13. సెల్ఫిష్ నెస్ (5) |
| 14. మంచి పనులు. (5) |
| 15. తేలికి వ్యతిరేకం (3) |
| 18. ఎన్‌సైక్లోపీడియా (3,4) |
| 19. లా (2) |
| 21. కోడికూత వేళ కుత్సితుడు వచ్చాడు(2) |
| 22. బిందు సహిత సతతము సతతమే (4) |
| 23. తగర చెట్టు (6) |
నిలువు:
| 1. తపోలోకములో పావురము (4) |
| 2. కలతపడిన తీగ (2) |
| 3. ఒక పదానికి బదులుగా వాడే అదే అర్థం గల పదం (5) |
| 5. మీనాలయములో కలిసిన యమునా నది (2) |
| 6. తుత్తునియలు (6) |
| 9. ఆంధ్రజ్యోతి దినపత్రికలో గమనం అనే కాలమ్ నడిపిన రాజకీయ విశ్లేషకుడు. (5,2) |
| 10. వ్రతములు ఆచరిస్తే చేకూరునది వితరణ పుణ్య సిద్ధి? (4,3) |
| 11. పూజితములో పరిశుద్ధమైనది (3) |
| 12. ఎదగకుండా ముదిరిన అనే అర్థంలో రావిశాస్త్రి ప్రయోగించిన పదం. కానీ ఇక్కడ తారుమారయ్యింది. (3) |
| 13. సభ ప్రారంభంలో అతిథులను ఆహ్వానిస్తూ చేసే ప్రసంగం (6) |
| 16. కాణాచి. స్థానం వారి నివాసం (5) |
| 17. ఇంచీ (4) |
| 20. నియంతలో మావటీడును వెదకండి. (2) |
| 21. నలకూబరుడిలో శిశువు (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 జనవరి 14వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 జనవరి 19 తేదీన వెలువడతాయి.
పదసంచిక-33 జవాబులు:
అడ్డం:
1.ఆదరాబాదరా 4.కూజితము 7.సఫా 8.రిమ్మ 9.అంటరానివేలుపు 11.కుడితి 13.జవాబుదారు 14.రసపుత్రులు 15.బక్షీసు 18.పుష్పరసాహ్వయము 19.సరే 21.జావ 22.ముఖమలు 23.రంధ్రాన్వేషణము
నిలువు:
1.ఆసనము 2.దఫా 3.రామునిదాడి 5.తరి 6.ముమ్మనుమరాలు 9.అండజంబుపానుపు 10.పుక్కిటిపురాణము 11.కురుబ 12.తిరసు 13.జఠరరసము 16.క్షీరసాగరం 17.చెలువము 20.రేఖ 21.జాణ
పదసంచిక-33కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధా సాయి జొన్నలగడ్డ
- ఈమని రమామణి
- బయన కన్యాకుమారి
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- సరస్వతి పొన్నాడ
- తాతిరాజు జగం
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.
















